సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వర్చువల్ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.