రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవల్లి నుంచి హనుమాన్ జంక్షన్‌కు వెళ్లే వైపు ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి తలకి గాయమైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతన్ని సమీప ఆసుపత్రిలోకి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.