డ్రైనేజీ కాలువలను పరిశీలించిన మంత్రి

NDL: కోయిలకుంట్ల పట్టణంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నాడు పర్యటించారు. పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. డ్రైనేజీ కాలువలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.