వడదెబ్బ మృతుల కుటుంబాలకు భరోసా
NGKL: అచ్చంపేటలోని ఎండ తీవ్రతతో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.4లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని తహసిల్దార్ సైదులు తెలిపారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ మరణాలపై వైద్య అధికారి, ఎస్సై, తహసిల్దార్లతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుందని ఆయన వివరించారు.