అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్

అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్

SKLM: పలాస మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో మున్సిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న రహదారులు, కాలువలు, పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వార్డు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు ఉన్నారు.