VIDEO:కాలువలో పడిన లారీ… డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ లారీ కాలువలో పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. టిప్పర్ అధిక లోడుతో వస్తుండటంతో ఆ బరువుకు దోససాడు చానల్ కాలువ వద్ద బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది. దీంతో టిప్పర్ కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వంతెన కూలడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.