కూలిన ఇంటి పై కప్పు .. తప్పిన పెనుప్రమాదం

SRPT: కోదాడ పట్టణంలోని 26వ వార్డు బస్టాండ్ పక్క వీధిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ బాగ్దాద్ ఇంటి పైకప్పు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కూలింది. వర్షాల కారణంగా పైకప్పు బాగా నానిపోయి, సమయానికి పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు ప్రభుత్వ సహాయం కోరుతూ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు.