విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని గుడిమూలకిలో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందాడు. గొర్ల రవి కిరణ్(34) విద్యుత్ స్తంభం ఎక్కి రిపేర్ చేస్తుండగా విద్యుత్ సరఫరా అవ్వడంతో కిరణ్ మృతి చెందాడు. స్తంభం పైన గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. విద్యుత్ లైన్‌మేన్లు పోల్ ఎక్కకుండా ప్రైవేట్ వ్యక్తులను ఎక్కించి ప్రాణాలు తీస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.