డీఎస్సీ అభ్యర్థుల వినూత్న నిరసన

ATP: దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డీఎస్సీ అభ్యర్థుల వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రోడ్డుపై కుర్చీలను వేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయని పక్షంలో వ్యతిరేకత చాటుతామన్నారు.