VIDEO: 'ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తా'
NLR: కందుకూరు అంకమ్మ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను MLA ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కందుకూరులో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. సెంటర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి రోడ్లను విశాలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.