VIDEO: మద్యం మత్తులో యువకులు.. యువతిని ఢీకొట్టిన కారు
MLG: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బండారుపల్లి రోడ్డులో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గరు యువకులు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చెరుకుని యువకులను అదుపులోకి తీసుకుని, కారును స్వధీనం చేసుకున్నారు.