జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
MHBD: జిల్లా పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 98 వార్డులలో మొత్తం 1,27,682 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 193 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అవసరమైన పోలింగ్ సిబ్బందితో పాటు 20శాతం అదనంగా అధికారులు నియామకం.