సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ

KMR: బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ప్రభుత్వ 'పనుల జాతర'లో భాగంగా ఎల్లమ్మ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్, సెక్రెటరీ, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.