బస్ స్టాప్ మీపంలో పెద్ద పులి సంచారం
MNCL: భీమారం మండలంలోని నర్సింగాపూర్ బస్టాప్ సమీపంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బస్ స్టాప్ వెనుక ఉన్న పొదల్లో కలియ తిరిగినట్లు వారు పేర్కొన్నారు. పులి పాద ముద్రలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి, సిబ్బంది పులి పాదముద్రలు సేకరించారు. పులికి ఎలాంటి హాని కలిగించొద్దు అన్నారు.