ట్రంప్‌నకు ఇరాన్ సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలి హెచ్చరిక జారీ చేశారు. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలని డిమాండ్ చేశారు. స్థావరాలను మూసివేయకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ప్రకటించారు. శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు హర్మూజ్ మూసివేత తప్పదు అని పేర్కొన్నారు. అమెరికాపై దాడులు కొనసాగిస్తామని వెల్లడించారు.