మహిళలు హక్కులను సద్వినియోగం చేసుకోండి: SP

మహిళలు హక్కులను సద్వినియోగం చేసుకోండి: SP

కోనసీమ: మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా SP రాహుల్ మీనా సూచించారు. కలెక్టరేట్ వద్ద డీఆర్డీఏ, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలు వినియోగించుకోవాలని కోరారు. సమాజంలో మహిళల రక్షణ, సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.