రెండు వాహనాలు ఢీ ఒకరు మృతి

రెండు వాహనాలు ఢీ ఒకరు మృతి

SRPT: రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున, చిలుకూరు మండల సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హుజూర్ నగర్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తున్న సిమెంట్ లారీ, హుజూర్ నగర్ వెళ్తున్న బొలెరో వాహనం రెండు ఎదురుగా ఢీకొనడంతో బొలెరో వాహనం డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.