టెట్‌కు 1.26 లక్షల దరఖాస్తులు.. 29 వరకే గడువు

టెట్‌కు 1.26 లక్షల దరఖాస్తులు.. 29 వరకే గడువు

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తుల గడువు ఈనెల 29వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. పేపర్‌-1కు 46,954, పేపర్‌-2కు 79,131 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. గడువు ముగియక ముందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.