VIDEO: ఆటోలో వదిలేసిన నగదు 8 గంటల్లో రికవరీ..!
విశాఖపట్నం కంచరపాలెం క్రైమ్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, ఆటోలో మర్చిపోయిన రూ.1.60 లక్షల విలువైన సొత్తును కేవలం 8 గంటల్లోనే రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఓ ప్రయాణికుడు నగదు, ఆపిల్ ఫోన్, బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను ఆటోలో వదిలేయగా, ఎస్సై షైక్ అబ్దుల్ బృందం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను గుర్తించారు.