నేడు విద్యార్ధులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

నేడు విద్యార్ధులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

KRNL: జిల్లాలోని అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరగనుంది. 1-19 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. కాగా, 400MG ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు.