VIDEO: కారు టైర్‌కు నిప్పుపెట్టిన దుండగులు
అన్నమయ్య: రామసముద్రం(మం) దిగువ నల్లప్పగారిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు కారు టైర్‌కు నిప్పుపెట్టిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన నరసింహులు ఇంటి వద్ద పార్క్ చేసి ఉంచిన కారుకు టైర్‌కు దుండగులు నిప్పుపెట్టారు. టైర్ పేలిన శబ్దం వినిపించడంతో నరసింహులు తండ్రితో కలిసి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.