వింజమూరు విద్యార్థికి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు

వింజమూరు విద్యార్థికి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు

NLR: వింజమూరు జెడ్.పి.పి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నాటకం గురు విఘ్నేష్ జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థి పురస్కారం అందుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ మాలకొండయ్య గురువారం తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వింజమూరు మండలం నుంచి గురు విఘ్నేష్ మండలం స్థాయిలో సత్తా చాటారు.