కామారెడ్డిగూడలో ఓటింగ్
వికారాబాద్ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మండలంలో 21 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మ. ఒంటిగంట వరకు పోలింగ్ జరిగనుంది. కామారెడ్డిగూడలో అత్యల్పంగా 509 మంది ఓటర్లు ఉన్నారు. సిద్ధులూర్‌లో అత్యధికంగా 2378 మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాల లెక్కింపు నిర్వహిస్తారు.