'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయం'

'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయం'

SRD: పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నందిగామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న విక్రమ్ గౌడ్ గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ వేసే పర్వంలో కాంగ్రెస్ శ్రేణులు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.