ఆపరేషన్ 'సింధూర్' విజయవంతం కావాలని పూజలు

ఆపరేషన్ 'సింధూర్' విజయవంతం కావాలని పూజలు

E.G: పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతి చర్యగా ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ఆపరేషన్ 'సింధూర్' విజయవంతం అవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి, మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.