'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తాజాగా ఈ సినిమా నుంచి 'దేఖ్ లేంగే సాలా' ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దేవి శ్రీ సంగీతం అందించిన ఈ పాటను విషాల్ దద్లాని పాడగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. అయితే, పూర్తి పాటను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.