VIDEO: భూ భారతి చట్టంపై అవగాహన

GDWL: జిల్లాలోని వడ్డేపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సంతోష్ ముఖ్య అతిథిగా సోమవారం పాల్గొన్నారు. ధరణి చట్టంలో ఉన్న లోపాలను తొలగించేందుకు భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని కలెక్టర్ తెలిపారు. భూములకు ఆధార్ లాగా భూధార్ కార్డులు జారీ చేయనున్నట్టు, భూమి వివరాలు సులభంగా పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.