భక్తి శ్రద్ధలతో దేవితండా సేవాలాల్ బ్రహ్మోత్సవాలు
NZB: ఇందల్వాయి మండల కేంద్రంలోని దేవిఘడ్ దేవితండా సేవాలాల్ ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం TG ఆర్టీసీ మాజీ ఛైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చండీయాగం, యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవాలు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పూజారులు హాజరయ్యారు.