పాక్ వద్ద నాలుగు రోజులకే శతఘ్ని గుండ్లు

భారత్‌తో యుద్ధం వస్తే పాకిస్తాన్ వద్ద శతఘ్ని గుండ్లు 4 రోజుల్లో ఖాళీ అవుతాయని ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. తక్కువ నిల్వలు, ఉక్రెయిన్‌కు అమ్మకాలు, ఉత్పత్తి కష్టాలతో పాక్ ఇబ్బంది పడుతోంది. భారత్ ఎదురుదాడి చేస్తే శతఘ్నులు, ఇతర ఆయుధాల పనితీరు గణనీయంగా పడిపోనుంది. ఆర్థిక బలహీనత మందుగుండు నిల్వలపై ప్రభావం చూపుతోందని పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కూడా అన్నారు.