సంపత్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

సంపత్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

విశాఖ నగరంలో గల సంపత్ వినాయక ఆలయాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఉగాది అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు.