బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సతీమణి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సతీమణి

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చిలుముల వెంకన్న అనారోగ్యంతో మరణించాడు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప శనివారం వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.