నేడు విశాఖకు కేంద్రమంత్రి కుమారస్వామి
AP: రేపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో AMNS ఇండియా స్టీల్ ప్లాంటుకు భూమిపూజ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కుమారస్వామి ఈ సాయంత్రం నగరానికి రానున్నారు. రేపు ముందుగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించి.. పనులు, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అనకాపల్లి జిల్లాకు వెళ్లి CM చంద్రబాబుతో పాటు భూమిపూజ తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.