అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఆటో

అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఆటో

వరంగల్: చెన్నారావుపేట మండలంలోని పాత ముగ్ధుపురం గ్రామ సమీపంలో నెక్కొండ - నర్సంపేట ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ఓ కారును తప్పించబోయి ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కకు ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా వారిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.