జిల్లా గ్రంథాలయలో రివ్యూ సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించిన రివ్యూ సమావేశంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ, శాఖ గ్రంథాలయాల సమస్యలను సమీక్షించారు. భవన మరమ్మతులు, కరెంట్, బాత్రూం సమస్యలు, సెస్ వసూళ్లు, సభ్యత్వాల పెంపు, సమయపాలనపై సూచనలు చేశారు. పదవీ విరమణ పొందిన ముగ్గురు ఉద్యోగులను సన్మానించారు.