విద్యుత్ సరఫరాకు అంతరాయం
HNK: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా హన్మకొండ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు టౌన్ డీఈ సాంబరెడ్డి ప్రకటనను విడుదల చేశారు. అలంకార్ సర్కిల్, కాపువాడ, మచిలీ బజార్, కాకతీయ కాలనీ పరిసరాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సిద్ధార్థ నగర్, న్యూ బస్టాండ్, చౌరస్తా, ఏనుగుల గడ్డ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు.