కోడిపిల్లకు రెండు తలలు.. కానీ.!
NDL: ఒక కోడి 10 నుంచి 20 గుడ్లు పెడుతుంది. పొదిగే నుంచి పిల్లలను పెట్టే వరకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుందో అంచనా వేయలేం. కానీ మహానందిలోని అబ్బీపురంలో గురువయ్య ఇంట్లో ఓ కోడి పిల్లకు రెండు తలలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కోడిపిల్ల గురువారం జన్మించగా, శుక్రవారం మృతి చెందిందన్నారు. జన్యు పరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.