రూ. 50 వేల విలువ చేసే బాణాసంచా పట్టివేత
శ్రీకాకుళంలోని బలగ సమీపంలో ఉన్న బీ. నాగరాజు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న బాణాసంచాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. బాణాసంచా విక్రయించేందుకు సిద్ధం చేశారని సమాచారం తెలుసుకున్న పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ. 50 వేల విలువ చేసే సరకు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు 2వ పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు.