రేపు మైనారిటీ సంక్షేమ దినోత్సవం
AP: రాష్ట్రంలో రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరగనుంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. జీవనకాల సాఫల్య పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులు అందించనున్నారు.