పెంపుడు కుక్క కాటు నిర్లక్ష్యానికి యువకుడి ప్రాణం

పెంపుడు కుక్క కాటు నిర్లక్ష్యానికి యువకుడి ప్రాణం

సత్యసాయి: చిలమత్తూరు మండలం దేమకేతేపల్లికి చెందిన యువకుడు విశ్వనాథ్ పెంపుడు కుక్క కరిచిన 10 రోజుల తర్వాత రేబిస్‌ తో మృతి చెందాడు. ఇంటి కుక్కేనని భావించి నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి విషమించింది. అనంతరం టీకాలు వేసినప్పటికీ వ్యాధి తీవ్రత పెరిగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గ్రామంలో ఆందోళన కలిగించింది.