'ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలి'
KMM: రిటైర్ అయిన వారికి చెల్లింపులు చేయకపోవడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని టీఏపీఆర్పీఏ అసోసియేషన్ నాయకులు ఇవాళ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలన్నారు. ఈ క్రమంలో టీఏపీఆర్పీఏ ఆధ్వర్యంలో ఖమ్మంలో 7వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.