లాడ్జి యజమానిపై కేసు నమోదు: సీఐ
గుంటూరు: జర్నలిస్టులను అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించిన లాడ్జి యజమాని నాగరాజుపై పొన్నూరు పోలీసులు ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇటీవల పొన్నూరులోని ఒక లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల నాగరాజు దురుసుగా ప్రవర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరనాయక్ తెలిపారు.