VIDEO: బ్రిడ్జి మంజూరు చేయాలని కోరిన వర్ధన్నపేట ఎమ్మెల్యే
HNK: వంగపహాడ్, పలు గ్రామాలను క్రాస్ చేసుకుంటూ ఓఆర్ఆర్ వెళ్తుందని, ఇసుక లారీలు చాలా ఓవర్ స్పీడ్‌గా రావడంతో ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.