టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
MNCL: మందమర్రిలోని సోమగూడెం టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన బర్ల శంకర్ (64) అనే వ్యక్తి మృతి చెందాడు. శంకర్, భార్య రాజేశ్వరితో కలిసి నెన్నెల గ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ రైలింగ్ ఢీకొంది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాజేశ్వరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.