దుత్తలూరు MEOగా షేక్ ఫజల్ అలీ

NLR: దుత్తలూరు నూతన ఎంఈవోగా షేక్ ఫజల్ అలీ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన పద్మనాభరావు జలదంకి మండలానికి బదిలీ అయ్యారు. నెల్లూరు సంతపేట గవర్నమెంట్ మోడల్ హైస్కూల్‌కు చెందిన షేక్ ఫజల్ అలీని ప్రమోషన్‌పై దుత్తలూరు ఎంఈవోగా నియమించారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.