పట్టపగలే వెలుగుతున్న స్ట్రీట్ లైట్స్

HYD: ఉప్పల్ భగాయత్‌లోని కాలభైరవ స్వామి ఆలయం రోడ్‌లో గత మూడు రోజులుగా స్ట్రీట్ లైట్స్ రాత్రింబవళ్ళు వెలుగుతూనే ఉన్నాయి. ఇది విద్యుత్ సిబ్బంది వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ వినియోగాన్ని సక్రమంగా వినియోగించాలని కోరుతున్నారు.