ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: జేసీ
PPM: ప్రజల నుంచి అందుతున్న రెవెన్యూ వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఛాంబర్‌లో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని రెవెన్యూ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.