లావేరు గ్రంథాలయములో పుస్తక ప్రదర్శన

SKLM: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం లావేరు శాఖా గ్రంధాలయములో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పుస్తకం మంచి నేస్తం వంటిదని ఎంతటి మేధావైనా పుస్తకం చదవాల్సిందేనన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. పోటీ పరీక్షాపుస్తకాలు తెప్పించామన్నారు.