పార్వతీపురంలో శక్తి యాప్ పై అవగాహన సదస్సు
PPM: పార్వతీపురంలోని పలు పాఠశాల్లో జిల్లా శక్తి టీమ్ ASI శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. మహిళల రక్షణ చట్టాలను తెలిపి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను రూపొందించి అనుసంధానంగా శక్తి టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు.