కుక్కల నియంత్రణపై కమిషనర్ ఆదేశాలు
కర్నూలులో వీధి కుక్కల సమస్య నివారణకు చర్యలు వేగవంతం చేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను శనివారం ఆదేశించారు. డాగ్ షెల్టర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గార్గేయపురం డంప్ యార్డ్‌ను పరిశీలించిన ఆయన బయో మైనింగ్ వేగవంతం చేయాలని, స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.