VIDEO: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
ADB: ఆదిలాబాద్ నుంచి జందాపూర్ గ్రామానికి వెళ్తున్న డీజే ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఘటనలో డీజే వాహనంలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కేటీసీ కంపెనీ హైవే వద్ద డీజే వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.